కోర్టుచౌరస్తా, మార్చి 31 : కరీంనగర్ బార్ అసోసియేషన్ (2023 -24)ను శుక్రవారం ఎన్నుకున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి ఎన్నికలు నిర్వహించ గా సాయంత్రం ఎన్నికల అధికారి ఎం రామకృష్ణాచారి ఫలితాలను ప్రకటించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా బీ రఘునందన్‌రావు, ఉపాధ్యక్షుడిగా వాల మహేందర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా లింగంపల్లి నాగరాజు ఎన్నికయ్యారు. కోశాధికారిగా కొట్టె తిరుపతి, లైబ్రరీ కార్యదర్శిగా ఎం సంపత్, స్పోర్ట్స్, కల్చరల్ కార్యదర్శిగా ఓంకార్‌ను ఎన్నుకున్నారు.
సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పెంచాల శ్రీనివాసరావు, జగదీశ్వరాచారి, మధు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఆంజనేయు లు, హరికృష్ణ, బొజ్జ స్వామి ఎన్నికయ్యారు. కార్యదర్శి పదవికి సిరికొండ శ్రీధర్ రావు, మహిళా ప్రతినిధిగా హేమలత ఏకగ్రీవంగా ఎన్నికైన విష యం తెలిసిందే. ఎన్నికల్లో 929 మంది ఓటు హక్కు కలిగి ఉండగా, 834 ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, రాష్ట్ర సివిల్ సైప్లె చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్, సుడా చైర్మన్ జీవీ రామ కృష్ణారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌గౌడ్, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు.