Terrace Garden | కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 8 : నగరంలో ప్రజలు మిద్దె తోటలను సాగు చేయడం ద్వారా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని నగర కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ అన్నారు. ప్రజలు మిద్దె తోటల పెంపకంపై ఆసక్తి చూపించాలని సూచించారు. స్వచ్చ్ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ ఇవాళ నగరంలోని కిసాన్ నగర్ ఏరియాలో పర్యటించారు. ఈ ప్రాంతంలో పలు నివాస గృహాలను సందర్శించి గృహ యజమానులు సాగు చేస్తున్న మిద్దె తోటలను పరిశీలించారు. మిద్దె తోటల సాగు విధానం, పద్దతులు వాటి వల్ల కలుగుతున్న ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో మిద్దె తోటలపై ప్రజలు ఆసక్తి చూపించి మీ ఇంటి మేడపై డబ్బాలు, కుండిలు, మట్టి పాత్రల్లో వివిధ రకాల కూరగాయలు, పూల మొక్కలను పెంచుకొవాలని సూచించారు. మిద్దె తోటలు పెంచడం ద్వారా చాలా ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. పరిశుభ్రమైన, ఎలాంటి రసాయనాలు వాడని కూరగాయలను మిద్దె తోటల ద్వారా పొందవచ్చని తెలిపారు.
మిద్దె తోటలను పెంచేవారు ఇంట్లో ఉత్పత్తి అయ్యే తడి చెత్తను హోం కంపోస్టింగ్ చేసి.. కూరగాయలు, పూల మొక్కలకు వాడుకోవాలని సూచించారు. మహిళలు ముఖ్యంగా మిద్దె తోటలను పెంపకంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ వేణు మాధవ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామీ, మెప్మా సీవోలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
Shadnagar | రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Kunal Kamra | కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట
KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తాం : కేటీఆర్