హుజూరాబాద్‌టౌన్, నవంబర్ 24: కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటామని టీఎంపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర కుమార్ మాదిగ పేర్కొన్నారు. టీఎంపీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గారే వెంకటేశ్ ఆదేశాల మేరకు హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో చలో ఢిల్లీ (డిసెంబర్ 8న జంతర్ మంతర్ వద్ద) మాదిగల మహాధర్నా కార్యక్రమ వాల్ పోస్టర్‌ను గురువారం ఆవిషరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి మాదిగ కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున బయలుదేరి రావాలని పిలుపునిచ్చారు. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. మాదిగ సమాజాన్ని మోసం చేస్తున్న బీజేపీలో మాదిగలు పనిచేయవద్దని కోరారు. ఆ పార్టీని రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షుడు తిప్పారపు రవి, రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు ఇంజం సాంబయ్య, నాయకుడు ఈర్ల పోచయ్య, జిల్లా కార్యదర్శి గన్నారపు కృష్ణప్రసాద్, నాయకులు తిప్పారపు భువనచంద్ర, ఎర్ర సంజీవ్, రాచపల్లి రాజు మాదిగ, మంద రవిమాదిగ, అంబాల రాజు, పొడిశెట్టి రాజ్‌కుమార్, తాళ్లపళ్లి సురేశ్, సోమిడి చేరాలు పాల్గొన్నారు.