గంగాధర, మార్చి 23: ఆత్మరక్షణ(Self-defense) కోసం ప్రతి ఒక్కరికి కరాటే అవసరమని ఒకీనోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఎగ్జామినర్ వసంత్ కుమార్ అన్నారు. ముఖ్యంగా బాలికలు కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు కరాటే ప్రతిభ పోటీలను నిర్వహించారు.
పోటీల్లో పాఠశాలకు చెందిన 95 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. విద్యార్థులకు చీఫ్ ఎగ్జామినర్ వసంత్ కుమార్ ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పర్రెం లక్ష్మారెడ్డి, డైరెక్టర్ గుడి అనంతరెడ్డి, ప్రధానోపాధ్యాయులు నర్సింగారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.