Padi Puja | కమాన్చౌరస్తా, డిసెంబర్ 26 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో తెలంగాణ ఆనంద్ గురుస్వామి ఆధ్వర్యంలో 108 మంది కన్నె స్వాములతో, 108 కళశాలతో పడిపూజా కార్యక్రమం నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ, డింగిరి చాణక్య, మూర్తి, శ్రీనివాస్ వైదిక నిర్వహణలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయం చుట్టూ ప్రదర్శనలు నిర్వహించి, స్వామివారికి అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి సత్యనారాయణ, పల్లె నారాయణ గౌడ్, తమిళ సుధాకర్, శ్రీనివాసరాజు, పల్లె మురళి, నగునూరి రాజి రెడ్డి, సందీప్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.