Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 7 : కాల్వశ్రీరాంపూర్ మండల స్వర్ణకార సంఘం నూతన అధ్యక్షడిగా బొజ్జ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా తంగళ్లపల్లి రాజమౌళి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు మంగళవారం ఎన్నికల సమావేశం నిర్వమించారు.
ఈ మేరకు ఆ సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని, సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించారు. కమిటీ ఎన్నిక అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులను కుల సంఘం నాయకులు అభినందించి శాలువాతో సత్కరించారు.