Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, మార్చి 7 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి ఉన్నత పాఠశాలలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గాజనావేనా స్వరూప, పాఠశాల మహిళా ఉపాధ్యాయులు నన్నెబోయిన రమాదేవి, జంగపల్లి స్వరూప, అంగన్వాడీ ఉపాధ్యాయులు సుద్దాలా శ్రావని, ఒడ్నాల రాజమని, ఏఎన్ఎం ఈర్ల సునీత, ఆశ వర్కర్ మేకల రాధ, అంగన్వాడీ ఆయా బొడ్డుపల్లి వాణి, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు ఆముదాల సారమ్మ, మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఎర్రోజుల సరస్వతి, జక్కుల రమాదేవి, నాంపల్లి వనిత, వివో లశెట్టి రవళి పాఠశాల పారుశుధ్య కార్మికురాలు జక్కుల రాజేశ్వరమ్మ, జీపీ వర్కర్ ఆముదాల సారమ్మ ను శాలువాతో సత్కరించారు.
పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు సత్య ప్రకాష్ రావు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఆగయ్య, ఎల్లయ్య, రాజమౌళి, రమేష్, వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.