జగిత్యాల, డిసెంబర్ 20: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు విమర్శించారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఫార్ములా-ఈ రేసును హైదరాబాద్లోపెట్టి రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను పెంచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ కేటీఆర్‌పై కక్షసాధింపుతోనే కేసు నమోదు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా పక్షాన కేటీఆర్‌పై పెట్టి న కేసులను ఖండించారు.
జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ‘ఈ సామ్.. ఆ సామ్’ అంటూ ప్రజలను రేవంత్‌రెడ్డి సర్కార్ మోసం చేస్తున్నదని విమర్శించారు. అసెంబ్లీలో ఈ-కార్ రేసుపై ప్రభుత్వం ఎందుకు చర్చ పెట్టడం లేదో సమాధానం చెప్పాలన్నారు. కేవలం కేటీఆర్‌పై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని సూచించారు. రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్, పాముకాటు, ఇతర సమస్యలతో బాధపడుతుంటే.. ఆ దృష్టిని మరలించడానికి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందన్నారు.
ఓటుకు నోటు విషయంలో జైలుకు వెళ్లిన రేవంత్‌రెడ్డి.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు భయపడేది లేదన్నారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, ఫార్ములా ఈ-కార్ రేసును 55కోట్లతో నిర్వహిస్తే 700 కోట్ల లాభం జరిగిందన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్నారు. అయినా కేటీఆర్‌పై అక్రమ కేసులుపెట్టి.. సీఎం రేవంత్‌రెడ్డి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో గట్టు సతీశ్, అల్లాల ఆనంద్‌రావు, తుమ్మ గంగాధర్, పడిగెల గంగారెడ్డి, అమీన్బాయ్, శీలం ప్రవీణ్, ఆయిల్నేని వెంకటేశ్వర్రావు, వొల్లాల గంగాధర్,సల్మాన్ పాల్గొన్నారు.