కోరుట్ల, నవంబర్ 17: కోరుట్లలోని ప్రభుత్వ బా లుర జూనియర్ కళాశాలలో కాషన్ మనీ డిపాజిట్ (సీఎండీ) నిధులను ఇన్చార్జి ప్రిన్సిపాల్ స్వాహా చేసినట్టు తెలిసింది. ఇన్చార్జి ప్రన్సిపాల్‌గా బాధ్యతలు తీసుకు న్న ఓలెక్చరల్ తన వ్యక్తిగత అవసరాల కోసం ఈ నిధు లను వాడుకున్నట్టు ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. కోరుట్లలోని ప్రభుత్వ బాలుర జూ నియర్ కళాశాలలో విద్యార్థుల నుంచి ఫీజుల రూపం లో సుమారు 40 ఏండ్ల నుంచి సేకరించిన 17లక్షల సీఎండీ నిధులు కళాశాలకు చెందిన బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేశారు. అయితే ఈ నిధులను కాలేజీ నిర్వహణ, ల్యాబ్, శానిటేషన్ ఇతరత్రా ఖర్చుల కోసం వినియోగించేవారు. ప్రిన్సిపాల్ గౌసూర్ రహ్మన్ ఇటీవల అమెరికాలో ఉన్న తన కూతురు వద్దకు సెలవుపై వెళ్లా డు. జూలై 11 నుంచి అక్టోబర్ 25 వరకు హిందీ లెక్చరర్ ఇమ్రాన్‌ఖాన్ ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు తీసుకున్నాడు.
ఈ సమయంలో ఆయన విడుతల వా రీగా కళాశాల ఖాతాలో ఉన్న 17లక్షల నిధులను వ్య క్తిగత అవసరాల కోసం డ్రా చేసుకున్నట్టు తెలిసింది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన ప్రిన్సిపాల్ గౌసూర్ ర హ్మన్ చార్జీ తీసుకునే సమయంలో బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలు స్టేట్మెంట్ తీసుకున్నాడు. బ్యాంకులో డిపాజిట్ చేసిన నిధులు గల్లంతైన విషయాన్ని గమనించి ఇన్చార్జి ప్రిన్సిపాల్‌ను నిలదీశాడు. వ్యక్తిగత అవసరాల కోసం తానే నిధులు వాడుకున్న ట్టు ఒప్పుకోవడంతో వెంటనే జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నారాయణకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్‌కు డీఐఈవో నోటీసులు జారీ చేశారు. నిధుల స్వాహా వ్యవహారంపై విచారణ జరిపి ఆర్జేడీ, కమిషనర్లకు నివేదిక అందించారు. కాగా, నిధుల్లో 3లక్షలు మళ్లీ కాలేజీ అకౌంట్లో ఇన్చార్జి ప్రిన్సిపాల్ డిపాజిట్ చేశాడు. ఈవ్యవహారంపై పూర్తి స్థా యిలో విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసు కోవాలని అధ్యాపకులు,విద్యార్థులు కోరుతున్నారు.