నందిమేడారంలో న్యాయ సేవలు
సామాన్యులకు సత్వర న్యాయమందించే లక్ష్యంతో ప్రభుత్వం నందిమేడారంలో జూనియర్ సివిల్కోర్టును ఏర్పాటు చేయాలని సంకల్పించిం ది. 2022 నవంబర్ 26న రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- నేడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం
- హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
- హాజరుకానున్న హైకోర్టు జడ్జీలు నవీన్‌రావు, శ్రవణ్‌కుమార్
- ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి జిల్లా కోర్టు జడ్జిలు, అధికారులు
ధర్మారం, ఫిబ్రవరి4: సామాన్యులకు సత్వర న్యాయమందించే లక్ష్యంతో ప్రభుత్వం నందిమేడారంలో జూనియర్ సివిల్కోర్టును ఏర్పాటు చేయాలని సంకల్పించిం ది. 2022 నవంబర్ 26న రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గ్రామంలోని పెద్దపల్లి వెళ్లే రోడ్డు మార్గం బైపాస్ మూలమలుపు వద్ద కోర్టు ఏర్పాటు కోసం అద్దె భవనాన్ని తీసుకున్నారు. ఈ తాత్కాలిక భవనంలో జడ్జి చాంబర్‌తో పాటు ప్రత్యేక హాల్‌ను ఏర్పాటు చేశారు. అవసరం మేరకు ఫర్నిచర్‌ను సిద్ధం చేశారు. భవనానికి పెయింటింగ్ వేశారు. కోర్టు సిబ్బంది కోసం అన్ని వసతులు కల్పించారు. ఇక్కడి కోర్టులో ప్రత్యేక జడ్జిని నియమించారు. ఇక్కడే సివిల్, క్రిమినల్ కేసులు విచారణ చేపట్టనుండగా మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు చిన్నాచితక కేసుల విచారణ కోసం పెద్దపల్లికి వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు నందిమేడారంలోనే న్యాయసేవలు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉన్నదని చెబుతున్నారు.
కోర్టు మంజూరు చేసిన సర్కారుకు మనస్ఫూర్తిగా రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు. కాగా, కోర్టు ప్రారంభానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం నందిమేడారం గ్రామానికి చెందిన హైకోర్టు జడ్జి పొనుగోటి నవీన్‌రావు, పెద్దపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నాగరాజు, జిల్లా సీనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎం.అర్జున్, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాయిపాటి సురే శ్‌బాబు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు.
ధర్మారం మండలం నందిమేడారంలో నేటి నుంచి న్యాయ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి ఫస్ట్ క్లాస్ కోర్టును ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవం చేయనున్నారు. హైకోర్టు జడ్జిలు పోనుగోటి నవీన్‌రావు, ఎన్వీ శ్రవణ్ కుమార్ అతిథులుగా హాజరుకానున్నారు. పెద్దపల్లి జిల్లా కోర్టు జడ్జిలు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

