Kabaddi Competitions | ధర్మారం, జనవరి 18 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖానంపల్లిలో రెండు రోజులపాటు జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. స్థానిక సర్పంచ్ కాలువ మల్లయ్య, ఉప సర్పంచ్ బెజ్జంకి యమున రాజేందర్, స్థానిక నాయకుడు ఆరే కొమురయ్య సహకారంతో ఈ పోటీలను స్థానిక యువకులు పొన్నం సాయి, కట్కూరి సాయి,కట్కూరి మహేష్, గడ్డం అజయ్ ఆర్గనైజర్లుగా వ్యవహరించి పోటీలను నిర్వహించారు.
ఈ పోటీలలో 20 జట్లు పాల్గొని హోరా హోరీగా తలపడ్డారు. ఈ పోటీలలో లక్సెట్టిపేట జట్టు విజేతగా నిలిచింది. పుట్నూరు జట్టు రన్నర్ గా నిలిచింది. తృతీయ స్థానంలో తురకల మద్దికుంట జట్టు నిలిచింది. విన్నర్ జట్టుకు రూ.10వేలు, రన్నర్ జట్టుకు రూ.5వేలు, తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.3వేలు నగదు , ట్రోఫీలను సర్పంచ్,ఉప సర్పంచ్ ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆరె రాజు, పొన్నం ఉదయ్, నేరెళ్ల రాజు, రాపల్లి శ్రీకాంత్, యువకులు తదితరులు పాల్గొన్నారు.