పెద్దపల్లి కమాన్, ఏప్రిల్ 21 : నిరుద్యోగ యువకులకు మెడ్‌ప్లస్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 25న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీలో 40 ఫార్మాసిస్టు, 50 ఆడిట్ అసిస్టెంట్, 201 సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు.
ఆసక్తి గల అభ్యర్థులు 25న ఉదయం 11 గంటలకు పెద్దపల్లి కలెక్టరేట్లోని ఉపాధి కార్యాయలంలో సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8985336947, 8121262441 నెంబర్లలో సంప్రదించాలన్నారు.