జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డి లేఖ
అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2లక్షల ఉద్యోగాలు, తర్వాత ఏటా లక్ష చొప్పున ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
- 600 మంది కంప్యూటర్ ఆపరేటర్లను విధుల్లోకి తీసుకోవాలి
- రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయాలి
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి
జగిత్యాల, జూలై 28 : అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2లక్షల ఉద్యోగాలు, తర్వాత ఏటా లక్ష చొప్పున ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రెవెన్యూ కార్యాలయాల్లో తొలగించిన 600 మంది కంప్యూటర్ ఆపరేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళవారం ఆయన లేఖ రాశారు. ఎన్నికల ముందు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను సంవత్సర కాలంలో భర్తీ చేస్తామని, అనంతరం ఏర్పడే ఖాళీలన్నీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం భర్తీ చేస్తామని, జాబ్‌క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రస్తుతం ప్రభుత్వ బాధ్యతల నిర్వహణలో ఉన్న కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రాధాన్యత క్రమంలో శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లకుపైగా గడిచినా ఇంతవరకు ఏ వాగ్దానం అమలు చేయలేదని మండిపడ్డారు. కనీసం రాజీవ్ యువ వికాసం లాంటి కార్యక్రమాల ద్వారా స్వయం ఉపాధికి సంబంధించి ఏ ఒకరికి కూడా అవకాశం కల్పించలేదన్నారు. దశాబ్దకాలానికిపైగా రెవెన్యూ కార్యాలయాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ఉపాధి పొందుతున్న దాదాపు 600కుపైగా కంప్యూటర్ ఆపరేటర్లను ఏ కారణం లేకుండా విధుల నుంచి తొలగించారని ఆగ్రహించారు. దీని వల్ల రాష్ట్ర స్థాయిలో 600కుపైగా కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. ప్రభుత్వం నిరుపేదలకు, ప్రత్యేకంగా యువతకు అండగా నిలుస్తుందని భావిస్తే.. నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు.
నిరుద్యోగ యువత పూర్తిగా నిరాశ, నిసృ్పహలకు లోనవుతున్నదని ఆవేదన చెందారు. దశాబ్ద కాలం నుంచి రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను ఏకపక్షంగా తొలగించడం ప్రభుత్వ నియంతృత్వ పోకడకు అద్దం పడుతుందన్నారు. తక్షణమే ఉద్యోగాల భర్తీ చేపట్టడంతోపాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, అలాగే రాజీవ్ యువ వికాసం ద్వారా స్వయం ఉపాధి కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని, రెవెన్యూ కార్యాలయాల్లో తొలగించిన 600కుపైగా కంప్యూటర్ ఆపరేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

