కొత్త కలెక్టర్లు వచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు ట్రాన్స్ఫర్ కాగా, వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్‌కుమార్ ఝా, జగిత్యాల కలెక్టర్‌గా బీ సత్యప్రసాద్, పెద్దపల్లి కలెక్టర్‌గా కోయ శ్రీహర్ష ఆయా జిల్లాల కలెక్టరేట్ల కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించారు.