మల్లాపూర్, అక్టోబర్ 7: దేశంలో అత్యున్నత స్థానమైన సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి (సీజేఐ)పై దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పులేరి రాము అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట సంఘం నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల పవిత్రమైన న్యాయస్థానంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని, ఈ దాడి పూర్తిగా భారత చట్టాల వ్యవస్థ, రాజ్యాంగంపై దాడి చేసినట్లు అని ఆరోపించారు. ప్రధాన న్యాయమూర్తులకు ప్రత్యేక భద్రత కల్పించాలని కోరారు. ఆయన వెంట నాయకులు ఆకుతోట నర్సయ్య, బండారి రమేష్, మాట్ల బుచ్చయ్య, కొంపల్లి రాజు, రంజిత్, ప్రభాకర్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.