రాయికల్, జులై, 30 : రేవంత్ రెడ్డి పాలన ఏమి మంచిగా లేదు . కేసీఆర్ పాలననే మంచిగా ఉండే… మళ్లీ కేసీఆర్ వస్తేనే అందరికీ మంచిగా ఉంటుందని ఓ 65 ఏండ్ల వృద్ధురాలు గత కేసీఆర్ పాలన, ఇప్పటి రేవంత్ రెడ్డి పాలనపై తన మనసులోనీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. వివరాల్లోకి వెళితే రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన పంతెంగి లక్ష్మీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారం తో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైంది.
కాగా మంజూరైన చెక్కును జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ బుధవారం ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా వసంత లబ్ధిదారురాలు లక్ష్మి ఇంటికి వెళ్లగా ఆమె లేకపోవడంతో ఆమె అత్త మల్లవ్వకు అందజేశారు. ఈ సందర్భంగా మల్లవ్వ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరూ సంతోషంగా లేరని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఇంకోసారి కాంగ్రెస్ కి ఓటు వేయమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బర్కం మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు, నాయకులు హన్మండ్ల మహేష్, మోర వెంకటేశ్వర్లు, సాగర్ రావు, రాజి రెడ్డి, సాయి రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.