కోరుట్ల, మార్చి 21: పట్టణంలోని కల్లూరు రోడ్ లో గల డంపింగ్ యార్డులో జరుగుతున్న బయో మైనింగ్ చెత్త శుద్ధీకరణ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బయో మైనింగ్ జరుగుతున్న విధానాన్ని తెలుసుకొని సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు.
బయోమైనింగ్ ద్వారా డంపింగ్ యార్డ్ లోని చెత్తను ప్రాసెసింగ్ చేసి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈఈ సురేష్ , అసిస్టెంట్ ఇంజినీర్ అరుణ్ కుమార్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ , ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ మహేష్, బయో మైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు.