జగిత్యాల : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రత్యేకంగా పూజలు చేశారు.
ఈ సందర్భంగా మల్యాల మండలం ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి అంజన్న ఆలయ ప్రాకార మండపంలో స్వామివారికి సంకల్ప కార్యక్రమంతో పాటు ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. కేటీఆర్ నిండు నూరేళ్లు జీవించడంతో పాటు గాయం నుంచి త్వరగా కోలుకోవాలని స్వామివారిని వేడుకున్నామన్నారు. ఆయన వెంట మల్యాల జడ్పీటీసీ రామ్మోహన్రావు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, ముత్యంపేట కొండగట్టు సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.