పెగడపల్లి : దసరా పండుగను పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచడం సిగ్గుచేటని జగిత్యాల జిల్లా జిఎస్టి కోకన్వీనర్ గంగుల కొమురెల్లి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీల తగ్గింపు పట్ల పెగడపల్లి మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో సంబురాలను నిర్వహించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దసరా, దీపావళి కానుకగా ఆర్టీసీ బస్సు చార్జీలను భారీగా పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శిలు అంజన్న, కొత్తూరి బాబు, పార్టీ నాయకులు కాకల సతీష్, కాశెట్టి రాజు, కన్నం పవన్ కళ్యాణ్, చింతకింది కిషోర్, అంకమల్ల అనిల్, శ్రీనివాస్ ఉన్నారు.