Jagityal : నలందా డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. B.Com & BBA సీనియర్ విద్యార్థులు జూనియర్లకు కాలేజీలోకి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆద్యంతం సందడిగా సాగిన ఈ వేడుకలో కళాశాల కరస్పాండంట్ శ్రీపాద నరేష్ (Sreepada Naresh) మాట్లాడుతూ.. డిగ్రీతోనే విద్యార్థులు జీవితంలో స్థిరపడవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’లోని ముఖ్యమైన కోర్స్‌లు అన్నీ కామర్స్‌కు చెందిన స్కిల్స్ అని, అవన్నీ B. com విద్యార్థులకు యూనివర్సిటీ సెలబస్లోనే ఉన్నాయని ఆయన తెలిపారు. విద్యార్థులు డిగ్రీ శ్రద్దగా చదివితే అత్యద్భుతంగా జీవితంలో సెటిల్ కావొచ్చు అని ఆయన విద్యార్థులకు సూచించారు.
ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నవ్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గాలిపెల్లి ఈశ్వర్ కుమార్ B.Com తో కార్పొరేట్ ఉద్యోగాలు, యూనివర్సిటీ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్బంగా చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు Say No to Drugs అనే కాన్సెప్ట్ తో చేసిన షార్ట్ ఫిల్మ్ అందరినీ ఆకట్టుకుంది.
డాన్స్ చేస్తున్న విద్యార్థినిలు
ఈ లఘు చిత్రంలో జగిత్యాల డీఎస్పీ దురిశెట్టి రఘు చందర్ ప్రత్యేకంగా విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా మంచి కేరీర్ ను నిర్మించుకోవాలనే సందేశం ఇచ్చారు. ఈ షార్ట్ ఫిల్మ్ చేసిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.