సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
గొల్లపల్లి : గొల్లపల్లి మండల కేంద్రంలోని నల్లగుట్ట నుంచి ఎస్సీ కాలనీ వరకు డ్రైనేజీ నిర్మాణానికి రూ.1.44కోట్లు, రోడ్డుకిరువైపులా వెడల్పు పనుల నిమిత్తం రూ.2కోట్లు మొత్తం రూ.5.24కోట్ల నిధులను మంజూరు చేయడాన్ని హర్షిస్తూ శుక్రవారం స్థానికులు, టీఆర్ఎస్ నాయకులు గొల్లపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై సీఎం కేసీఆర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ జలంధర్, ప్యాక్స్ జిల్లా అధ్యక్షుడు రాజ సుమన్‌రావు, మార్కెట్ చైర్మన్ ముస్కు లింగారెడ్డి, వైస్ ఎంపీపీ ఆవుల సత్తయ్య, గంగాధర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్ప్రధాన కార్యదర్శి బాబు, యూత్ అధ్యక్షుడు రవీందర్, గొల్లపల్లి పట్టణ అధ్యక్షుడు జలంధర్, పట్టణ యూత్ అధ్యక్షుడు రాజశేఖర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు కిష్టారెడ్డి, నాయకులు లింగారెడ్డి, నారాయణరెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటరమణ, రవీందర్, బుచ్చిరెడ్డి, గంగాధర్, నల్లగొండం గౌడ్ పాల్గొన్నారు.