జగిత్యాల : దుర్మార్గాన్ని, అన్యాయాన్ని ఎదిరించిన చాకలి ఐలమ్మ (Chakali Ailamma) పోరాట స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula) కోరారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో శనివారం చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. త్యాగానికి మారుపేరు చాకలి ఐలమ్మ అని ప్రశంసించారు. ఐలమ్మ త్యాగాలు రాబోయే తరాలకు తెలియజేయడానికి విగ్రహాలను ఆవిష్కరించుకుంటున్నామని అన్నారు. అన్యాయం ఎవరు చేసినా ఎదిరించాలని పిలుపునిచ్చిన ధీరశాలి చాకలి ఐలమ్మని అన్నారు. మహనీయుల త్యాగఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు.