జగిత్యాల : వినడం ద్వారా నేర్చుకునే దాని కన్నా చూసి నేర్చుకోవడం ఎంతో మేలు చేస్తుందని అందువలన డిజిటల్ విద్య వలన విద్యార్థులు పాఠాలు బాగా నేర్చుకుంటారు. డిజిటల్ విద్య ఎంతో మేలు చేస్తుందని జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత అన్నారు. బుధవారం స్థానిక ఓల్డ్ హై స్కూల్ రోటరీ క్లబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన రీయూజబుల్, వాషబుల్ క్లాత్ సానిటరీ ప్యాడ్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు అసౌకర్యం కలగకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తున్న రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం అన్నారు.
అనంతరం ఆరు లక్షల విలువచేసే సానిటరీ ప్యాడ్స్ జగిత్యాల అర్బన్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న ఎనిమిది వందల మంది విద్యార్థినులకు పంపిణీ చేశారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ అరవ లక్ష్మి మండల విద్యాధికారి చంద్రకళ రోటరీ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏవీఎల్ ఎన్ చారి రాజు రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ టీవీ సూర్యం బొడ్ల జగదీష్ పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనంద్ రావు యాల్ల అమర్నాథ్ రెడ్డి ప్రముఖ వైద్యులు స్వరూప తదితరులు పాల్గొన్నారు.