మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్ మండలాల్లో పర్యటన
ధర్మపురి/ధర్మపురి రూరల్(బుగ్గారం)/వెల్గటూర్ 25: ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రం కోటిన్నర ఎకరాల మాగాణిగా మారి దేశానికి అన్నపూర్ణమ్మ లాగా అవతరించిందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. ఆదివారం మంత్రి ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్ మండలాల్లో పర్యటించారు. తొలుత వెల్గటూర్ మం డలం స్తంభంపల్లి శివారులో నిర్మిస్తున్న హరిత హోటల్ పనులను పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టరును ఆదేశించారు. ఆగస్టు 15వరకు స్లాబ్ వరకు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ చెప్పారు. అనంతరం మంత్రి అక్కడి నుంచి ధర్మపురి మండలంలో పర్యటించారు. కమలాపూర్ శివారులో రూ.4.88కోట్లతో నిర్మించిన బొలిచెరువు బంధం మాటును మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన బుగ్గారంలో రైతు వేదిక, వైకుంఠధామం, పల్లెప్రకృతివనాన్ని, మండలంలో రూ.50లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
హరితహారంలో భాగంగా రైతువేదిక ఆవరణలో మొక్కలు నాటారు. బుగ్గారం ఎస్సీ కాలనీలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బుగ్గారం మండల పరిషత్ కార్యాలయంలో 37మందికి రూ.11లక్షల 45వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి ఈశ్వర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. బంధం చెరువులో నీరు వృథాగా పోకుండా రూ.4.88 కోట్లు వెచ్చించి, పట్టా భూములు కొనుగోలు చేసి చెరువు సామర్థ్యం పెంచడంతో పాటు కట్టను బలోపేతం చేశామని తెలిపారు. ఈ బంధం మాటు నిర్మాణం వల్ల 5 గ్రామాల రైతులకు 5044ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరందుతుందన్నారు. బుగ్గారం మండ లం యశ్వంతరావుపేటకు చెరువు పునరుద్ధరణకు రూ.2.70కోట్లు మంజూరయ్యాయని, ఆ చెరువు నుంచి వచ్చే కాలువలకు కూడా మరమ్మతులు చేపట్టనున్నామన్నారు. అక్కపెల్లి చెరు వు పునరుద్ధరణ, చెరువులో నీరు ఎత్తిపోసేందుకు గోదావరి ఒడ్డున ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్ ఆధారంగా ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.72.10కోట్లు మంజూరయ్యాయన్నారు. క్షేత్రానికి వచ్చే భక్తులు సేద తీరేలా అక్కపెల్లి చెరువు వద్ద పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. బొలిచెరువు బంధం మాటు వద్ద కూడా గుట్ట ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపడతామన్నారు.
బంధం మాటు కాలువలకు కూడా మరమ్మతు చేయిస్తామన్నారు. బంధం వద్దకు రోడ్డు వేసేందుకు రూ.5లక్షల నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. ధర్మపురి నియోజకవర్గంలో గోదావరి ఒడ్డున 13 ఎత్తిపోతల పథకాలు. చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం పూర్తి చేయడం వల్ల లక్షా 20వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ సీఈ సుధాకర్‌రెడ్డి, డీఈఈలు నారాయణరెడ్డి, చక్రూనాయక్, డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీలు ఎడ్ల చిట్టిబాబు, రాజమణి, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్, బత్తిని అరుణ, ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, ఆర్బీఎస్ కన్వీనర్ సౌళ్ల భీమయ్య, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్‌కుమార్, కమలాపూర్, రామయ్యపల్లి సర్పంచులు కొండపల్లి లక్ష్మి, మేడపట్ల దుబ్బయ్య, ఎంపీటీసీ కాళ్ల సత్తయ్య, నాయకులు సంగి శేఖర్, వొడ్నాల మల్లేశం, చిలివేరి శ్యాంసుందర్, ఇనగంటి వెంకటేశ్వర్రావు, భా రతపు గుండయ్య, ఎమ్డీ సలీమ్, అప్పాల వ సంత్, చెన్నోజి ప్రసాద్ తదితరులున్నారు.
గుట్ట ఎక్కి..మాటును ప్రారంభించి..
బొలిచెరువు బందం మాటు ప్రారంభోత్సవాని కి మంత్రి ఈశ్వర్ రెండు కిలోమీటర్ల దూరం గు ట్ట ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లారు. బొలిచెరువు బంధంమాటు రెండు గుట్టల మధ్యలో ఉండడం వల్ల అక్కడివరకు వాహనాలు వెళ్లలేని స్థితిలో దాదాపు కిలోమీటర్ల దూరం వరకూ అటవీ ప్రాంతంలో గుట్ట నుంచి నడుచుకుంటూ వెళ్ల్లి మాటును ప్రారంభించారు.