విగ్రహానికి కాషాయ కండువా వేసిన వారిని అరెస్ట్ చేయాలి
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దొంత రమేశ్
హుజూరాబాద్ టౌన్, జూన్ 25: హుజూరాబాద్ చౌరస్తాలోని అంబేదర్ విగ్రహానికి కాషాయ కండువా వేసిన బీజేపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ మాజీ అనుసంధాన అధికారి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దొంత రమేశ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ కండువా కప్పి బీజేపీ నాయకులు అంబేదర్ను అవమానించడాన్ని టీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా బాధ్యులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే అన్ని వర్గాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ దుశ్చర్యకు బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యులని ఆరోపించారు. దేశంలో ఎకడ ఎన్నికలు జరిగినా బీజేపీ ఇలాంటి నీచ రాజకీయాలకు తెరలేపడం అలవాటు చేసుకుందని, ప్రజలందరూ ఇలాంటి చిల్లర రాజకీయాలను తిప్పికొట్టాలని దొంత రమేశ్ పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు సందమల్ల బాబు, కొండ నరేశ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి: నరేశ్
అంబేదర్ విగ్రహానికి బీజేపీ కండువా వేసిన ఆ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల అనుచరుడు సందమల్ల నరేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పోలీసులకు దళిత నాయకుల ఫిర్యాదు
అంబేదర్ మెడలో బీజేపీ కండువా వేయడాన్ని పలువురు దళితులు తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాక సతీశ్, తునికి సమ్మయ్య, బత్తుల సమ్మయ్య, బత్తుల రాజలింగం, తొగరు స్వామి, ఎండీ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.