జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు
ఘనంగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మీకాంతారావు జన్మదిన వేడుకలు
కార్పొరేషన్/తెలంగాణచౌక్, నవంబర్ 17: తెలంగాణ ఉద్యమంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట నడుస్తూ కీలక పాత్ర పోషించారని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు కొనియాడారు. నగరంలో బుధవారం కెప్టెన్ లక్ష్మీకాంతారావు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలంగాణచౌక్‌లో టీఆర్ఎస్ నాయకుడు అమరావతి సలీం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై సునీల్‌రావు హాజరై కేట్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కెప్టెన్ ఎంతో మంది పేదలకు సహాయసహకారాలు అందించినట్లు పేర్కొన్నారు. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన కెప్టెన్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అలాగే, ఇటీవల టీఆర్ఎస్ కార్యకర్త జహంగీర్ కరోనాతో మృతి చెందగా ఆయన సతీమణికి రూ. 50 వేల నగదు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాల్‌రావు, కార్పొరేటర్లు సరిళ్ల ప్రసాద్, మేచినేణి వనజ-అశోక్‌రావు, భూమాగౌడ్, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే, హౌసింగ్‌బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్రస్వామి వృద్ధాశ్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, హౌసింగ్‌బోర్డు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఆకుల ప్రకాశ్, మోహన్, నర్సింహచారి, ఆదిత్య, సుఫియాన్, శృహాన్, లవన్, విష్ణు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.