ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
హరితహరంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, కలెక్టర్ రవి
ఓపెన్ జిమ్, ఇండోర్ స్టేడియం ప్రారంభం
కోరుట్ల, జూలై 4: హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నా రు. పట్టణ శివారు కావేరి గార్డెన్ సమీపంలో జాతీయ రహదా రి వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఏడో విడుత హరితహారం కార్యక్రమాన్ని కలెక్టర్ గుగులోత్ రవి, మున్సిపల్ అధ్యక్షురాలు అన్నం లావణ్యతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి పక్కన ఎమ్మెల్యే, కలెక్టర్ మొక్కలు నాటి ట్రీగార్డులను తొడిగారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ సంపద వృద్ధి చెందితేనే వర్షాలు సకాలంలో కురుస్తాయని పేర్కొన్నారు. హరితహారంలో నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలపడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నట్లు ఎమ్యెల్యే తెలిపారు. అలాగే పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మున్సిపల్ ప్రత్యేక నిధులు రూ.15 లక్షలతో నిర్మించిన ఓపెన్ జిమ్‌తో పాటు రూ.కోటి 69 లక్షలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 29 రకాల పరికరాలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇండోర్ స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. మైదానం చుట్టూ వివిధ రకాల పూల మొక్కలను నాటిస్తామని, వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లావ్యాప్తంగా 42 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ చెప్పారు. హరితహారంలో ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం సంతృప్తికరంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. 10 రోజులపాటు ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. అనంతరం ప్రజాప్రతినిధులు, మున్సిపల్ ఉద్యోగులు, మెప్మా ఆర్పీలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్‌కుమార్, జిల్లా ఇన్చార్జి యువజన, క్రీడల శాఖాధికారి మాధురి, మున్సిపల్ అధ్యక్షురాలు అన్నం లావణ్య, మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, జిల్లా అటవీ శాఖాధికారి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ మహ్మద్ అయాజ్, తహసీల్దార్ సత్యనారాయణ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, కౌన్సిలర్లు జిందం లక్ష్మీనారాయణ, సజ్జు, నాయకులు ఎలిశెట్టి భూంరెడ్డి, ఆడెపు మధు, పోగుల లక్ష్మీరాజం, సత్యం, జాల వినోద్‌కుమార్, జిల్లా శ్రీనివాస్, వాసాల గణేశ్, డీఈఈ అభినయ్, ఏఈ మహిపాల్, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, మెప్మా అధికారి జలంధర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దంపతుల పూజలు
మెట్పల్లి టౌన్, జూలై 4: పట్టణంలోని పెద్దమ్మ తల్లి ఆలయం లో జరిగిన కుంకుమపూజకు ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు-సరోజ దంపతులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పెద్దమ్మ తల్లి ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను భూమిపూజ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు రాణవేని సుజాత, కౌన్సిలర్లు పురుషోత్తం, మర్రి సహదేవ్, పిప్పెర రాజేశ్, డాక్టర్ సత్యనారాయణ, ముదిరాజ్ సంఘ సభ్యులు జక్కని బాబు, తిరుసుల్ల అర్జున్, యామ గణేశ్, యామ నర్సయ్య, మాడవేని గంగాధర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.