ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడమే సర్కారు ధ్యేయం
మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల, గొల్లపల్లిలో పట్టణ, పల్లె ప్రగతికి శ్రీకారం
పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే, కలెక్టర్
జగిత్యాల అర్బన్/గొలపల్లి, జూలై1: పల్లె, పట్టణ ప్రగతిని ప్రణాళికాబద్ధంగా.. పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. గురువారం జగిత్యాల మున్సిపాలిటీలోని 11వ వార్డు గాంధీనగర్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్ జీ రవి, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ము న్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణితో కలిసి ప్రారంభించారు. అలాగే గొల్లపల్లి మండలం దమ్మన్నపేటలో పల్లె ప్రగతిని ప్రారంభించి, మొక్కలు నాటి ఆయా చోట్ల మాట్లాడారు. ప్రజల కనీస అవసరాలైన తాగు నీరు, విద్యుత్, పారిశుధ్యం, విద్య, వై ద్యం వంటి సౌకర్యాలు కల్పించడమే అసలైన అభివృద్ధి అని సీఎం కేసీఆర్ భావిస్తారని చెప్పారు. గ్రామాలు, పట్టణాలలో పచ్చదనం పెంపొందించే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 150 కోట్లకు పైగా మొకలు నాటామని, మూడు శాతం మేర గ్రీన్ కవర్ వృద్ధి చేసుకున్నట్లు వివరించారు.
ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో ప్రజలు భాగస్వాములైనప్పుడే సత్ఫలితాలు అందుతాయని పేర్కొన్నారు.పట్టణ ప్రగతిలో భాగంగా ఎస్సీ కాలనీల్లో అధికారులు పాదయాత్ర తీసి సమస్యలు గుర్తించాలని, విద్యుత్, తాగు నీరు, లైటింగ్, డ్రైనేజీ,రోడ్లు వంటి మౌలిక సదుపాయాల స్థితిగతులపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కాగా, దమ్మన్నపేటలో కొత్తగా నిర్మించిన లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని మంత్రి ప్రారంభించి పూజలు చేశారు. గ్రామం లో రూ.10లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని, శ్మశాన వాటిక రోడ్డు, ఎస్సీ కాలనీ రోడ్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. జడ్పీ చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ పల్లె, పట్టణాల అభివృద్ధి, పచ్చదనం.. పరిశుభ్రత.. ప్రజల ఆరోగ్యంగా ఉం టేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని భావించి సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ జగిత్యాల మున్సిపాలిటీకి ప్రభుత్వం ప్రతి నెలా రూ.91లక్షల నిధులు విడుదల చేస్తున్నదని, పచ్చదనం, పారిశుధ్యం ప్రాధాన్యంగా మున్సిపాలిటీలు నిరంతరం పనిచేయాలని, నాటిన మొకల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కలెక్టర్ జీ రవి మాట్లాడుతూ జగిత్యాల మున్సిపాలిటీలో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని, రోడ్లకు ఇరువైపులా మొకలు నాటి సంరక్షించాలని సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి మాట్లాడుతూ జగిత్యాలలో పచ్చదనం పెంపొందించే దిశగా హరితహారంలో 10 లక్షల మొక ల పెంపకం దిశగా పనిచేస్తున్నామని, ప్రతి ఇంటికి ఆరు మొకలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమాల్లో ఇన్చార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఆర్డీఓ మాధురీ, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, డీఎఫ్ఓ వెంకటేశ్వర రావు, ఎంపీపీ శంకరయ్య, జడ్పీటీసీ జలందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ లింగారెడ్డి, ప్యాక్స్ అధ్యక్షులు రాజసుమన్ రావు, మాధవ రావు, ఆర్బీఎస్ అధ్యక్షులు కిష్టారెడ్డి, సర్పంచులు అనసూర్య, తిరుపతి, వైస్ ఎంపీపీ సత్తయ్య, నాయకులు రమేశ్, ఉన్నారు.