బీజేపీకి ఓట్లడిగే అర్హత లేదు
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ఇల్లందకుంట జూన్ 30: సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దళితుల పక్షపాతిగా కీర్తించబడుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉద్ఘాటించారు. ప్రజలకు అబద్ధాలు చెబుతూ ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ యత్నిస్తున్నదని మండిపడ్డారు. ఆస్తులను కాపాడుకునేందుకు కాషాయ కండువా కప్పుకున్న ఈటలకు ఓట్లడిగే అర్హత లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి పేషీలో దళిత ఐఏఎస్‌లు లేరని చెబుతున్న ఆయన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ దళితుడనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈటలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశిస్తే ఇందుకు అంగీకరించకపోవడం విడ్డూరమన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన ఆయన హుజూరాబాద్ ప్రజలకు చేసిందేంలేదని నిలదీశారు. ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని చెప్పారు. నిత్యావసర, పెట్రో ధరలు పెంచి ప్రజలను అడుగడుగునా దగా చేస్తున్న బీజేపీలోకి ఆయన ఎందుకు వెళ్లాడో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రగల్బాలు పలుకుతున్న ఆయనకు ప్రజాక్షేత్రంలో పరాభావం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో సుడా చైర్మన్ బీవి రామకృష్ణ, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయా గణపతి, ఎంపీటీసీలు ఎక్కటి సంజీవరెడ్డి, తెడ్ల ఓదెలు, బీర్ల విజయకుమార్, చిన్నరాయులు, రమ, మాజీ ఎంపీటీసీలు రాంస్వరణ్‌రెడ్డి, వీరారెడ్డి, గొనెగీతవీరన్న, సర్పంచులు రజిత, దిలీప్‌రెడ్డి, రాజు, వెంకట స్వామి, మానస, రాంమల్లయ్య, అరుణసదయ్య, మాజీ సర్పంచులు బుర్ర రమేశ్, ఉడుత వీరస్వామి, టీఆర్ఎస్ నాయకులు రవియాదవ్, తిరుపతిరెడ్డి, వాసు, ముస్తాఫా, మహేందర్, తదితరులు ఉన్నారు.