Jagityal | జగిత్యాల: వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన భాద్యత పిల్లలదేనని, విస్మరిస్తే జైలు శిక్ష, జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పీ మధుసూదన్ హెచ్చరించారు. ఆర్డీవో ఛాంబర్లో వృద్ధుల నిరాధరణ కేసులను ఆయన శనివారం విచారించారు.
జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట గ్రామానికి చెందిన గుర్రాల రాజవ్వ, గొల్లపల్లి మండలం మల్లన్నపేట్ కు చెందిన శేకుట గంగన్న, రాయికల్ మండలం అల్లీపూర్ కు చెందిన దాసరి లక్ష్మిబాయి, కొడిమ్యాల మండలం పూడూర్ కు చెందిన బేతేల్లి వసంత ల కుమారులు, కోడళ్లు, కూతుర్లను ఆర్డీవో విచారించారు.
వయో వృద్ధుల తరపున సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ తన వాదనలు వినిపించారు. ఈ విచారణ ల్లో ఏవో రవికాంత్, సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, కౌన్సిలింగ్ అధికారులు పీ హన్మంత్ రెడ్డి, వెల్ ముల ప్రకాష్ రావు, ఎఫ్ఆర్వో కొండయ్య, సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ కృష్ణార్చన తదితరులు పాల్గొన్నారు.