BC Reservation | పెద్దపల్లి టౌన్ : తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవల్లి ముత్యంరావు ఆరోపించారు. బీసీ సంఘాలు సీపీఎం, సిపిఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం పెద్దపెల్లి జిల్లాలో బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం ఎదుట బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లను బిజెపి అడ్డుకుంటుందని ఆరోపించారు బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు కోట శ్రీనివాస్ గౌడ్, సారయ్య, తాడూర్ శ్రీమాన్, కొలిపాక నరసయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి కల్లపెల్లి అశోక్, జి జ్యోతి, మోడం పల్లి శ్రావణ్ సి పెళ్లి రవీందర్ బొడ్డుపల్లి రమేష్, అక్కపాక తిరుపతి, సయ్యద్ మస్రత్, బొడ్డుపల్లి సంపత్, ప్రశాంత్ తదితరులు అధిక సంఖ్యలో సంఘాల నాయకులు పాల్గొన్నారు.