Boyinapalli | కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు.. బీఆర్ఎస్
ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతం కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బోయినపల్లి మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ గురువారం మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
- బోయినపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ డిమాండ్
- తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత
Boyinapalli | బోయినపల్లి రూరల్, అక్టోబర్ 29 : ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతం కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బోయినపల్లి మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ గురువారం మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కత్తెరపాక కొండయ్య మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో సరిపడా వర్షాలు కురవక పంటల ఎదుగుదల దెబ్బతిన్నదని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల కోసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి సాగు చేసిన రైతులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
రాష్ట్రంలో కొన్ని మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న బోయినపల్లిని విస్మరించడం అన్యాయమని విమర్శించారు. కరువు మండలాల ఎంపికలో రాజకీయాలకు తావివ్వకుండా క్షేత్రస్థాయిలో వర్షపాతం, పంటల నష్టం, సాగునీటి లభ్యతను పరిశీలించి బోయినపల్లిని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మండల రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులకు నిబంధనల ప్రకారం పరిహారం అందించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని కొండయ్య హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, సర్పంచులు అనుముల భాస్కర్, నిమ్మ భాగ్యలత-శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అక్కనపల్లి కర్ణాకర్, మాజీ సర్పంచులు చిందం రమేష్, రాజు, ముద్దం రవి, కవ్వంపల్లి రాములు, కొంకటి శేఖర్, బత్తిని కమల్‌గౌడ్, కన్నం సాగర్, బోయిని రాజు, నాగుల శ్రీనివాస్‌గౌడ్, బుర్ర పూర్ణచందు, బొజ్జ ప్రభాకర్, ఏడపెల్లి తిరుపతి, మల్లారపు చందు, పెగ్గర్ల శేఖర్, దూస మధు, గండ్ర సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Y.S. Jagan | చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం : వైఎస్ జగన్
Woman lost outside Zoo | భర్తతో కలిసి జూకు వెళ్లి అదృశ్యమైన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?
‘రైతుల భవిష్యత్ పోరాటాలకు నల్లగొండ మహాసభలో కార్యాచరణ’
Chain Snachers | చైన్ స్నాచింగ్ దొంగలను కిష్టమ్మ ఎలా చితక్కొట్టిందో చూశారా..?
Mallikarjun Kharge | నిరసనను వాయిదావేసే ప్రసక్తే లేదు, ర్యాలీ నిర్వహించి తీరుతాం : మల్లికార్జున్ ఖర్గే
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

