KORUKANTI CHANDAR | గోదావరిఖని : రామగుండం లో పరిపాలన గాడి తప్పిందని, అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అధికారులను బెదిరించడం విడ్డూరంగా ఉందని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మళ్లీ రౌడీ జాఫర్ జమానా కానవస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు.
రామగుండంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రభుత్వ అధికారులను బెదిరింపులకు గురిచేస్తూ ఇక్కడి నుండి పంపించే ప్రయత్నం చేస్తున్నారని, మీడియాకు కూడా రక్షణ కరువైందని ఆరోపించారు. ఇటీవల అంతర్గం తహసీల్దార్ మీద కాంగ్రెస్ నాయకుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించడం, ఒక ప్రైవేట్ ఆసుపత్రి తనిఖీకి వచ్చిన డీఎంహెవో అధికారిని కాంగ్రెస్ నాయకుడు బెదిరించడం సరైంది కాదన్నారు. 5 సంవత్సరాల కాలంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వైద్యులకు తాము అండగా నిలిచామని గుర్తు చేశారు.
గతంలో పిల్లల వైద్యులు దాడి చేయించి ఇక్కడ నుండి వెళ్లగొట్టిన చరిత్ర ఉన్న రాజ్ ఠాకూర్, ఎమ్మెల్యే అయిన తర్వాత మెడికల్ హబ్ అంటూ డాక్టర్లకు అండగా ఉంటానని మాట్లాడటం దయ్యాలు వేదాల వల్లించడంలా ఉందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత కాలుష్యానికి నిలయంగా ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి ద్వారా మెడికల్ కళాశాల ఏర్పాటు చేయుంచిన ఘనత తొలి సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ మెడికల్ కళాశాల ద్వారా వెల మంది పెదలు నిత్యం ఉచితంగా వైద్యం పోందుతున్నరని అన్నారు.
ఇప్పటికైన రామగుండం ఎమ్మెల్యే పాలనపై దృష్టి సారించాలని, అధికారులను బెదిరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రామగుండం మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, నాయకులు, మాజీ కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి, గాధం విజయ, నడిపెల్లి మురళీధర్ రావు, ముద్దసాని సంధ్యారెడ్డి, నూతి తిరుపతి, పిల్లి రమేష్, జక్కుల తిరుపతి, సట్టు శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావన్, గుర్రం పద్మ, రత్నాకర్, కిరణ్ జీ, నీరటి శ్రీనివాస్, దొమ్మేటి వాసు, కర్రీ ఓదేలు, ఆవునూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.