Sultanabad | సుల్తానాబాద్ రూరల్, జూలై 19 : గ్రామ పంచాయతీల ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ చైర్మన్ గర్రెపల్లి కారోబార్ జొన్నకోటి వెంకటేష్ కావడం అభినందనీయమని గర్రెపల్లి మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షులు పడాల అజయ్ గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో అజయ్ గౌడ్ శనివారం ఇటీవల ఎన్నికైన జొన్నకోటి వెంకటేష్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా అజయ్ గౌడ్ మాట్లాడుతూ భవిష్యతులో మరిన్ని పదవులు పొంది, ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మేకల రాజశేఖర్, గంధం అంజి, రమేష్ , సంపత్, మల్లేశం, రాజయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.