సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 22: గ్రామ పంచాయతీ సెక్రెటరీలపై మీ ప్రతాపమా..? ఇందిరమ్మ ప్రజా పాలనలో రాజన్నసిరిసిల్ల మహిళలపై జరిగిన అన్యాయం ఈ సంఘటన అని బి అర్ ఏస్ సీనియర్ నేత, జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధు కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతల వేధింపులతో తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక అదృశ్యంపై మంగళవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట విలేకరులతో ఆయన మాట్లాడారు. పంచాయతీ సెక్రటరీలకు అండగా ఉంటామని, వాళ్ళ తరఫున కోట్లాడుతామన్నారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్ అయిందని ఆరోపించారు. కొందరు లీడర్లు స్వంత లాభం కోసం అధికారులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ప్రజా పాలనలో మహిళలపై జరిగిన అన్యాయం ఇది..రాజన్న సిరిసిల్ల మహిళ లోకం సిగ్గుపడే ఘటన అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక పంచాయతీ కార్యదర్శులకు పని భారం ఎక్కువైందన్నారు.
స్వంత ఖర్చులు పెట్టుకొని ఎన్నో వ్యయప్రయాసలకు ఓరుస్తు గ్రామ అబివృద్దికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి పంచాయతీ కార్యదర్శులను చులకనగా చూడడం సరికాదన్నారు. ఒక మహిళ అని చూడకుండా ఇస్తారితీగా తిడుతూ ఒత్తిడి తీసుకొచ్చారని, ప్రతీ గ్రామంలో ఇదేపరిస్థితికనపడుతుందన్నారు. తల్లిదండ్రులకు చెప్పకుండా మానసిక క్షోభ అనుభవించి వెళ్లి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతలు ఆమెను మానసిక క్షోభకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించే రీతిలో వ్యవహారం చేశారని మండి పడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికతో పాటు ప్రభుత్వ పథకాలపై సెక్రరిటలపై ఒత్తిడి ఏక పక్షంగా వ్యవహారం కాంగ్రెస్ నాయకులు చేయడం సరికాదన్నా.రు
ఈ కార్యక్రమంలో బండి జగన్, కుర్మ రాజయ్య, గుండు ప్రేమ్ కుమార్, మోతే మహేష్ యాదవ్, సింగిల్ విండో డైరెక్టర్ బండి దేవేందర్ యాదవ్, గొడిసెల ఎల్లయ్య, సిలువే రీ చిరంజీవి, అమర్ రావు, ఆఫ్రోజ్, బొడ్డు శ్రీధర్, నెరేళ్ళ అనిల్ గౌడ్, జీవన్ పాల్గొన్నారు.