గోదావరిఖని, ఏప్రిల్ 18: తన స్వగ్రామం రాగినేడు గ్రామంలో నిర్మించిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవానికి రావాలని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవాం హైదరాబాద్‌లో అమాత్యుడిని మర్యాద పూ ర్వకంగా కలిసి ఆహ్వానపత్రాన్ని అందజేశారు.