కమాన్ చౌరస్తా, జూలై 10: గ్రూప్-1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు బీసీ స్టడీ సరిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు కరీంనగర్ బీసీ స్టడీ సరిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అభ్యర్థులు బుధవారం నుంచి ఈ నెల 19 వరకు వెబ్సైట్లో (www.tgbcstudycircle.cgg.gov.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 75 రోజులపాటు నిర్వహించే శిక్షణ ఈ నెల 22 నుంచి మొదలవుతుందని చెప్పారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5లక్షల లోపు ఉన్న అభ్యర్థులు అర్హులని చెప్పారు. శిక్షణకాలంలో నెలకు 5వేల ఉపకార వేతనం అందిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ (సైదాబాద్)లోని టీజీ బీసీ స్టడీ సరిల్ (రోడ్ నంబర్8, లక్ష్మీనగర్), ఖమ్మంలోని టీజీ బీసీ స్టడీ సరిల్లో ఉచిత శిక్షణ అందిస్తారని తెలిపారు. వివరాలకు నంబర్ (040-24071178)లో సంప్రదించాలని సూచించారు.