Horticulture | ముత్తారం, జులై 23; అయిల్ ఫామ్ లో అంతర పంటలు వేయడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టీకల్చర్ అధికారి శేఖర్ అన్నారు. మండలంలోని రైతు వేదికలో అయిల్ ఫామ్ రైతులతో బుధవారం అవగాహన కార్యాక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ అంతరపంటగా కోకో పంటలు వేసుకోవడంతో మంచి లాభాలు ఉంటాయన్నారు.
ఈ పంట వేయడం ద్వారా ఆయిల్ ఫాం పంట కూడా దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ కోకో మొక్కలను మోండలీజ్ కంపెనీ ద్వారా అందిస్తూ పంట దిగుబడిని కూడా కొనుగోలు చేస్తున్నారన్నారు. ఆయిల్ ఫామ్ మొక్కలు నాటినప్పుడు కోకో మొక్కలను నాటుకోవాలని ఈ రెండు మూడు సంవత్సరాలకు చేతికివస్తాయని తెలిపారు. ఇక్కడ డీహెచ్వో జగన్మోహన్ రెడ్డి, హెచ్ఏ మహేష్, జ్యోతీ, తిరుమల ఆయిల్ సీఈవో కళ్యాణ్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్లు విజయ్, రంజిత్ రైతులు పాల్గొన్నారు.