CPI | కోరుట్ల, సెప్టెంబర్ 29 : కోరుట్ల రైల్వే స్టేషన్లో ప్రయాణీకుల సౌలభ్యం కోసం మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం అన్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్నుసీపీఐ నాయకులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే స్టేషన్లో వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
9 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ రైల్వే స్టేషన్కు గతంలో ఉన్న కల్లూరు రోడ్డు నుంచి రైల్వే స్టేషన్ వరకు వచ్చే రహదారిని పునరుద్దరించాలన్నారు. ముంబై, హైదరాబాద్, తిరుపతి, వరంగల్, విజయవాడ నగరాలకు వెళ్లే రైల్ సర్వీస్ లను కోరుట్లలో అపేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైల్వే స్టేషన్ వరకు బీటీ అప్రోచ్ రోడ్డు నిర్మించాలని కోరారు. కోరుట్ల రైల్వే స్టేషన్లో ఆపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులకు వినతి పత్రం అందించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు, ప్రధాన కార్యదర్శి ముక్రం తదితరులు ఉన్నారు.