women’s groups | సారంగాపూర్, జూన్ 30: ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం అందిస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో మండలానికి చెందిన 47 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.12 లక్షల 48 వేలు, 31 మందికి కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన రూ.31 లక్షల విలువగల చెక్కులను లబ్ధిదారులకు సోమవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అర్హులైన ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మహిళ సంఘాల ద్వారా రూ.1లక్ష రుణం మంజూరు చేస్తామని, దీంతో బెస్మెంట్ వరకు పనులు ప్రారంభిస్తే ప్రభుత్వం నుండి మొదటి బిల్లు వస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచిత బస్సు, గృహ జ్యోతి పతకాలు అమలు చేస్తున్నామని అన్నారు. పెంబట్ల బీరయ్య గుడికి సీజీఎఫ్ నిధులు రూ.12 లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ నరసింహ రెడ్డి, వైస్ చైర్మన్ బాపిరాజు, మాజీ సర్పంచ్ గుర్రాల రాజేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్, తహసీల్దార్ వహిదొద్దీన్, ఎంపీడీవో చౌడారపు గంగాధర్, ఎంపీఓ సలీమ్, ఏపీఎం రాజయ్య, ఆర్ఐ వెంకటేష్, ఆయా శాఖల అధికారులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, మహిళలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.