Silver medal | పెద్దపల్లి, మే 10(నమస్తే తెలంగాణ): చైనాలోని అవైల్లో జరుగుతున్న వరల్డ్ కప్ స్టేజ్ టు పోటీల్లో అర్చరీ విభాగంలో భారత్ కు మొదటి పథకం లభించింది. ప్రపంచంలోని 30 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో భారత్ నుంచి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చీకీత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జ్యోతి సురేఖ, మహారాష్ట్ర నుంచి మధుర పాల్గొన్నారు.
వీరు టీం విభాగంలో సత్తా చార్డర్ చాటడంతో భారత్ కు సిల్వర్ మెడల్ లభించింది. ఆర్చరీలో దానికోసం ఇచ్చిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్లు శ్రీ దేవసేన, ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, బోయ శ్రీహర్షణకు చికిత కృతజ్ఞతలు తెలిపారు.