చిగురుమామిడి, ఆగస్టు 15: స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో విద్యార్థులు వీధులలో ర్యాలీ నిర్వహించి జాతీయ గీతాలను ఆలపించారు.
సింగిల్ విండో కార్యాలయం వద్ద చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, మండల ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారిని ప్రిసిల్లా ఏంజెల్, రైతు వేదిక వద్ద మండల వ్యవసాయ అధికారి రమ్యశ్రీ, ఇందుర్తి, చిగురుమామిడి పశువుల ఆరోగ్య కేంద్రం వద్ద మండల వైద్యాధికారులు సాంబా రావు, శ్రీనివాస్ రెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బాసం మధుసూదన్, రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ రమేష్, ఉదయలక్ష్మి మండల సమాఖ్య కార్యాలయం లో ఏపీఎం మండల రజిత, ఎంఆర్సి కార్యాలయంలో ఎంఈఓ పావని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ శశిధర్ శర్మ, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, సిపిఐ కార్యాలయంలో మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, బిజెపి కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు పోలోజు సంతోష్, కాంగ్రెస్ కార్యాలయం వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిమల్ల రవీందర్ జండాలను ఎగురవేశారు. కాగా రేకొండ ప్రభుత్వ పాఠశాలలో సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి వారి తండ్రి మాజీ ఎంపీపీ స్వర్గీయ చాడ ప్రభాకర్ రెడ్డి స్మారకార్థం ప్రతి యేటాలాగే ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన మొదటి, రెండు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు.
ఈ విద్యా సంవత్సరం 10 చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడులు, పెన్నులు పంపిణీ చేశారు. సీతారాంపూర్ లో మాజీ వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి వారు తండ్రి సంజీవరెడ్డి స్మారకార్థం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు బెల్టులు టైలు పంపిణీ చేశారు.ఈ వేడుకల్లో వివిధ శాఖల అధికారులు సింగిల్ విండో కార్యాలయం సీఈవో నర్సయ్య మండల పరిషత్ సూపర్డెంట్ ఖాజా మోహినుద్దీన్, డిప్యూటీ తాసిల్దార్ స్వరూప రాణి, ఆర్ఐ అరుణ్ కుమార్, పార్టీల నాయకులు కరివేద మహేందర్ రెడ్డి, గీకురు రవీందర్, ఎండి సర్వర్ పాషా, బెజ్జంకి రాంబాబు, ముక్కెర సదానందం, అందే స్వామి, చిట్టిమల్ల శ్రీనివాస్, చాడ శ్రీధర్ రెడ్డి, తాళ్లపల్లి తిరుపతి, పో తరవేణి వెంకన్న, బోయిని అశోక్, తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కాగా మండలంలోని అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల వద్ద ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని డార్విన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, ఇందుర్తి లో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో, బొమ్మనపల్లి విస్డం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు సంస్కృతి కార్యక్రమాలను నిర్వహించగా పలువురిని ఆకట్టుకున్నాయి.