కరీంనగర్ : చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రెండు రోజులుగా వణికిస్తున్నది. ఇటు పొగమంచు కమ్మేస్తున్నది. శనివారం ఉదయం పది గంటల వరకూ పరుచుకున్నది. ఎక్కడ చూసినా తెరలు తెరలుగా దర్శనమిచ్చింది.
పట్టణాల్లో రోడ్లపై వాహనాలు కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని వెళ్లాల్సి వచ్చింది. శివార్లలో పొగమంచు పరుచుకొని అందమైన దృశ్యాలు కనువిందు చేయగా, ‘నమస్తే’ క్లిక్‌మనిపించింది!