చండ్రుగొండ, మార్చి 11 : సీతారామ ప్రాజెక్టు పంట కాలువ సర్వేను రైతులు అడ్డుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెంలో చోటుచేసుకున్నది. ప్రాజెక్టు కాలువ విభాగం డీఈ నాగేశ్వరరావు, ఏఈ గణేశ్ తమ సిబ్బందితో బుధవారం సర్వే నిర్వహిస్తుండగా రైతులు అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. రైతులు మాట్లాడుతూ.. పంట కాలువ డిజైన్, ప్లానింగ్ స రిగా లేదని, దీనిని తరచూ మార్చడం వల్ల గ్రామంలోని ఇండ్లు, విలువైన భూములు కోల్పోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
తమకు తెలియకుండా, భూములకు న ష్టం కలిగించే విధంగా కాలువ నిర్మాణం చేపట్టాలని చూడ టం సరికాదని, రైతుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత డిజైన్ ప్రకారం కాలువ నిర్మిస్తే నీరు సక్రమంగా సరఫరాకాదని పేర్కొన్నారు. రైతుల డిమాండ్లను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని డీఈ నాగేశ్వరరావు పేర్కొనడంతో రైతులు శాంతించారు.