Kondagattu | జగిత్యాల :జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈనెల 20 నుండి 23 వరకు నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో దీక్షాపరులు సమర్పించిన ఇరుముడులను లెక్కించినట్లు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ఆలయానికి రూ.1,65,641 నగదు రూపంలో సమకూరినట్లు తెలిపారు. వస్తు రూపేణా బియ్యం, ఎండు కుడుకలు, భూరు తీయని కొబ్బరి సమకూరినట్లు తెలిపారు. సమకూరిన వస్తువులకు త్వరలోనే టెండర్ ప్రక్రియను నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పరిశీలకుడు రాజమౌళి, ఆలయ పర్యవేక్షకులు నీలా చంద్రశేఖర్, హరిహరనాథ్, సునీల్, ఆలయ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, పోలీస్ శాఖ ఏఎస్ఐ రమణారెడ్డి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.