ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయరమణారవు అన్నారు.
- పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
- ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డితో కలిసి పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ
పెద్దపల్లి టౌన్/పెద్దపల్లి రూరల్/ సుల్తానాబాద్ రూరల్/కాల్వశ్రీరాంపూర్/ఓదెల జనవరి 16: ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయరమణారవు అన్నారు. మంగళవారం పెద్దపల్లిలోని ఆర్ఆర్ గార్డెన్స్‌లో పీఆర్టీయూ కాలెండర్ను ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కాల్వశ్రీరాంపూర్‌లో సోమవారం ముదిరాజ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దమతల్లి బోనాల వేడుకలకు హాజరయ్యారు. ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ముదిరాజ్ కులస్తులు ఎమ్మెల్యేను సత్కరించారు. ఓదెల మండలం గుంపులలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే ముగ్గులను తిలకించారు.
విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆయాచోట్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. 317జీఓ ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని, సీపీఎస్ రద్దుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్, గౌరెడ్డిపేటలో పలు సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకు స్థాపన చేశారు. సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో నిర్వహించనున్న సమక్క-సారలమ్మ జాతర ఏర్పా ట్లను ఎమ్మెల్యే విజయరమణరావు పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలుగుకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కార్యక్రమాల్లో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కర్రు సురేశ్, ప్రధాన కార్యదర్శి గండు కృష్ణమూర్తి, ఉపాధ్యాయ నాయకులు బండ ఓదెలు, నారాయణ, రాధ, లక్ష్మీప్రసన్న, రాజన్న, సతీశ్‌బాబు, శ్రీనివాస్, హరికృష్ణ, రజమౌళి, గోపగాని సారయ్యగౌడ్, అంతటి అన్నయ్యగౌడ్, ఉప్పు రాజు, బోడ్డుపల్లి శ్రీనివాస్, కౌన్సిలర్లు భూతగడ్డ సంపత్, తూముల సుభాష్ రావు, నూగిల్ల మల్లయ్య, కాల్వశ్రీరాంపూర్ బోనాల వేడుకల్లో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రానవేన శ్రీనివాస్, సభ్యులు చొప్పరి సదానందం, చిలువేరు శ్రీనివాస్, రానవేన క్రాంతి, చెప్పాల శ్రీనివాస్, రానవేన రమేశ్, అక్కల రవి, బంగారి శ్రీనివాస్, బండారి ఓదెలు, మాజీ ఎంపీటీసీ బంగారి లావణ్యరమేశ్, నాయకులు చేతి ధర్మయ్య, అక్కల బాపన్న, గుంపులలో ఎంపీటీసీ తిప్పారపు శారదాసంపత్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మూల ప్రేంసాగర్‌రెడ్డి, రాఘవాపూర్, గౌరెడ్డిపేట సర్పంచ్‌లు ఆడెపు వెంకటేశం, కొమ్ముశ్రీనివాస్ పాల్గొన్నారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తా
ఎలిగేడు, జనవరి 16: జర్నలిస్ట్‌లందరికీ ఇళ్ల స్థలా లు ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయ రమణారావు భరోసాఇచ్చారు. ఎమ్మెల్యే నివాసం శివపల్లిలో టీడ బ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపి శాలువాతో సత్కరించారు. జర్నలిస్టుల ఇబ్బందుల గురించి ఎమ్మెల్యేకు వివరిం చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులకు తప్పకుండా ఇండ్ల నివేశన స్థలాలు ఇప్పిస్తానని, త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రణాళికా బద్దంగా జర్నలిస్టుల కోసం చర్చలు జరిపి తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక్కడ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు పోగుల విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి సుంక మహేశ్, నాయకులు మారం తిరుపతిరెడ్డి, బోయిని వినోద్, సుంక శ్రీధర్, సబ్బు సతీష్, కల్లపెల్లి దేవేందర్, ఓంకార్, బొల్లి సత్యం, పిట్టల పరమేశ్, గోపిక్రిష్ణ, చొప్పరి సుమన్, బాలరాజు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

