కోరుట్ల/ మల్లాపూర్, మే 12: కేడీసీసీబీ ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్రావు కోరారు. కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు, మల్లాపూర్ మండల కేంద్రంలో నిర్మించిన కేడీసీసీబీ నూతన భవనాలను సోమవారం ఆయన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్లతో కలిసి ప్రారంభించారు. ఆయా చోట్ల కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాట్లాడుతూ, సహకార బ్యాంక్‌ల ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలందిస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థుల చదువు కోసం రుణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తున్నామని, కోరుట్ల కేడీసీసీబీ రూ. 205 కోట్ల టర్నోవర్ సాధించినట్లు తెలిపారు.
రాష్ట్రంలోనే జిల్లా కేడీసీసీబీ రుణాల మంజూరులో ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మాట్లాడుతూ, జిల్లాలో సహకార సంఘాలు నిలదొక్కుకోవడానికి కొండూరి రవీందర్రావు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జిల్లా కేడీసీసీబీ రూ. 10 వేల కోట్ల టర్నోవర్ సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. కేడీసీసీబీ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కోరుట్లలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, బ్యాంక్ మేనేజర్ మున్వర్, కేడీసీసీబీ డైరెక్టర్లు మోహన్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు ఎలిశెట్టి భూంరెడ్డి, సింగిరెడ్డి నర్సారెడ్డి, ఆదిరెడ్డి, జగన్మోహన్రెడ్డి, భూమయ్య, సాయిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చీటి వెంకట్రావు, సింగిరెడ్డి నారాయణ రెడ్డి, మల్లాపూర్‌లో కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, సహకార సంఘం చైర్మన్ వేంపేట నర్సారెడ్డి, బద్ధం అంజిరెడ్డి, నేరేళ్ల మోహన్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ నరేశ్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు, రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కోరుట్ల రూరల్, మే 12: రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో కృషి చేస్తాయని కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. మండలంలోని సర్పరాజ్‌పూర్, పైడిమడుగు, జోగన్‌పల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన ఎరువుల గోదాములను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్యాంకు సేవలను రైతులతో పాటు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, జిల్లా సహకార సంఘాల ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నర్సారెడ్డి, సహకార సంఘాల అధ్యక్షులు జగన్మోహన్రావు, భూంరెడ్డి, ఆదిరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు వెంకట్రావ్, మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.