Inauguration | కమానౌచౌరస్తా, జూలై 31 : అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల శారీరక, మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ఆధునిక క్రీడా ప్రాంగణాలను గురువారం అద్విత విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య, మేనేజింగ్ డైరెక్టర్ అనుదీప్ సౌగాని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని అంశాలల అవగాహన కోసం క్రీడలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.
ఈ క్రమంలోనే పాఠశాలలో సాఫ్ట్ బాల్, వాలీబాల్ కోర్ట్, బ్యాడ్మింటన్, ప్రైమరీ మరియు ప్రీ- ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జిగ్ జాగ్ రన్, హర్డిల్స్ ట్రాక్, క్లోజ్ జంప్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.