KTR | గంభీరావుపేట, నవంబర్ 14 : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని బరిగేల గూడెం కాలనీలో రూపాయలు. 14 లక్షలతో నిర్మాణం చేసిన అంగన్వాడి భవన కేంద్రం ను శుక్రవారం కలెక్టర్ గరీమా అగర్వాల్ ప్రారంభించారు. స్థానిక ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటోలను ప్రారంభోత్సవ ఫ్లెక్సీలో పెట్టకుండానే కలెక్టర్ ప్రారంభించారు.
స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఫొటోలు ప్రభుత్వ అధికారిక ఫ్లెక్సీలలోని పెట్టడంలో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.