కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మంగళవారం పట్టణంలోని 23వ వార్డులో ఇంటింటా ప్రచారం చేశారు. గడపగడపకూ వెళ్లి, ఓట్లు అభ్యర్థించారు.
ఓ ఇంటి ముందు గద్దెపై కూర్చొన్న వృద్ధురాలిని ఆప్యాయంగా పలుకరించి, అవ్వా నీ ఓటు నాకే వేయాలని కోరారు. దీంతో ఆ వృద్ధురాలు ‘బిడ్డా.. నా ఓటు నీకే.. గెలుపు నీదే’ అంటూ ఆశీర్వదించారు.
– కోరుట్ల రూరల్, అక్టోబర్ 10